ముస్లీంల నిరసన ర్యాలీ

సిరా న్యూస్,ఆళ్లగడ్డ;

మహా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై మతోన్మాది నరసింహ నందు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ ఆళ్లగడ్డ పట్టణంలోని ఈద్గా మసీదు వద్ద నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ఆళ్లగడ్డ ముస్లిం జేఏసీ సభ్యులు మరియు ఉలమాల సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెక్యులర్ దేశమైన మన భారత దేశంలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల వలె జీవిస్తూ ఉండగా ఐకమత్యాన్ని బంగపరుస్తూ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఎంతోమందిని బాధించాయని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం ముస్లింలకే కాదు పూర్తి జగత్తుకు ఆయన ప్రవక్త అని పలువురు వ్యాఖ్యానించారు. పరుష పదజాలంతో ప్రవక్త గారిపై వ్యాఖ్యలకు పాల్పడి ఎంతోమంది ముస్లిం సోదరుల మనోభావాలను దెబ్బతీసిన నరసింహ నందు పై తక్షణమే చర్యలు తీసుకొని అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిఎస్పి కార్యాలయం చేరుకొని డిఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ జేఏసీ సంఘం నాయకులు బీరువాల భాష బరుగొడ్ల హుస్సేన్ బాషా హసన్ ఉలమాల సంఘం నాయకులు మౌలానా మహమ్మద్ రఫీ, హఫీజ్ లు సద్దాం హుస్సేన్, సాదిక్, ఆవాజ్ కమిటీ సభ్యులు, ఎస్ డి పి ఐ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,జమాత్ కమిటీ నెంబర్లు పెద్ద ఎత్తున ముస్లిం మత పెద్దలు మత గురువులు, ముర్షద్ లు, పీర్లు మరియు వారి శిష్య బృందాలు విజ్ఞులు మేధావులు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *