ఉపాధి హామీ సోషల్ ఆడిట్లో వెలుగు చూసిన వైనం
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం ;
చనిపోయిన వారికి మస్తర్లు వేసి ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతికి పాల్పడిందని చినతాడేపల్లి సోషల్ ఆడిట్ గ్రామ సభలో ఎస్ఆర్పే ఎం గోవిందు వెల్లడించారు. చినతాడేపల్లి సచివాలయం వద్ద సర్పంచ్ పిచ్చిల రాజారావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గ్రామసభలో పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఫీల్డ్ అసిస్టెంట్ పనికి వెళ్లని 26 మందికి మాస్టర్ వేసి 250లక్షలు స్వాహాచేశారని వారితోపాటు చిటకని చంద్రయ్య, జక్కంశెట్టి రాంబాబు, లాయి మునియ్య, మారిశెట్టి శ్రీలక్ష్మిలు చనిపోయి నాలుగేళ్లయినా ఇంకా మస్తర్ వేస్తున్నారని ఆరోపించారు. వాటిపై సమగ్ర దర్యాప్తు చేసి అవినితికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన చోడే సరస్వతి మాట్లాడుతూ 2016 నుంచి 19 వరకకూ పీల్ అసిస్టెంట్గా చేసిన తనను వైసీపి ప్రభుత్వంలో ఎలాంటి తప్పు చేయకపోయినా తనను తొలగించారని కోర్టు తీసుకోవాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటి పీల్డ్ అసిస్టెంట్ ఇందిర ప్రతీ సోషల్ ఆడిట్ లో చనిపోయిన వారి పేర్లతో మస్తర్లు వేసినా వైసీపీ నాయకులు అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు