సిరా న్యూస్,గుంటూరు;
రౌడీషీటర్ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ స్థితిలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న యువతి నిన్న మృతి చెందింది. నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. వల్లభాపురానికి చెందిన రౌడీషీటర్ నవీన్, తెనాలి ఐతానగర్‌కు చెందిన సహాన ఆరేళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. మూడు నెలల కిందట నవీన్‌కు.. సహానా 3 లక్షల రుపాయలు ఇవ్వగా.. అందులో సగం డబ్బులను తిరిగి చెల్లించాడు. మిగిలిన మొత్తం ఇవ్వాల్సి ఉంది. అక్టోబర్ 19న వారిద్దరూ కారులో తెనాలి మండలం కఠెవరం శివారుకు వెళ్లారు. అక్కడ సహాన తనకు రావాల్సిన నగదుతో పాటు తాను గర్భీణీ అని చెప్పటంతో ఇరువులు మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు.ఊహించని విధంగా సహానా తనను ప్రశ్నించటంతో మాటా మాటా పెరిగిన క్రమంలో యువతి తలను పట్టుకొని కారు డోర్‌కేసి కొట్టాడని పోలీసులు చెబుతున్నారు. ఆమె వాంతి చేసుకుని పడిపోవడంతో.. కంగారు పడిన నవీన్.. ఆమె తల్లికి సమాచారం ఇచ్చి తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్చాడు. ఆ సమయంలో అతని స్నేహితులు దత్తు, సుమంత్ సహాయంగా వచ్చారని పోలీసులు చెబుతున్నారు.సహాన బ్రెయిన్ డెడ్ అయ్యారని స్థానిక వైద్యులు చెప్పటంతో.. ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మూడు రోజుల చికిత్స అనంతరం మంగళవారం రాత్రి సహానా మృతి చెందింది. కారులో నవీన్, సహాన మాత్రమే ఉన్నట్టు తమ విచారణలో తేలిందని.. నవీన్ ఏ రాజకీయ పార్టీ పదవుల్లోనూ లేడని.. ఇది ప్రేమికుల మధ్య జరిగిన ఘటనగా పోలీసులు చెబుతున్నారు. 2016లో జరిగిన హత్య కేసులో నిందితుల్లో ఒకడైన నవీన్‌పై రౌడీ షీట్ తెరిచారని.. ఆ కేసు ముగిసిందని DSP వెల్లడించారు.తెనాలిలో బ్రెయిన్ డెడ్ అయిన యువతి మృతిలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ దాడిలో చనిపోయిన సహనాకి ఐదు వారాల ప్రెగ్నెన్సీ ఉన్నట్లు సమాచారం. నిన్న నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై అటెంటూ మర్డర్ 307తో పాటు BNS 354 సెక్షన్ కింద కేసు నమోదు పోలీసులు తెలిపారు. సహనా చనిపోవడంతో 307 సెక్షన్‌ను..302 గా మార్చినట్లు తెలుస్తోంది. బాధితురాలి తల్లి సాక్ష్యంతో.. నవీన్‌పై అత్యాచార చట్టం.. BNS 69 సెక్షన్ కింద కేసు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో నవీన్ తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టులో వచ్చే అంశాలను బట్టి.. మరో ఇద్దరు నిందితులను చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.తమ కుమారుడు కారు నడపడానికి మాత్రమే వెళ్లాడని నవీన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. సహాన కుటుంబం, తామూ బంధువులమని, ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నామని.., అంతలోనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. తమ కుమారుడిని కేసులో ఇరికించారని నవీన్ తల్లి ఆరోపిస్తున్నారు. సహాన కుటుంబంతో తమకు బంధుత్వం ఉందని…రాజకీయనేతలు చేరి…తన బిడ్డను రౌడీషీటర్‌గా మార్చారని చెబుతున్నారు. మరోవైపు.. సహానా ఫ్యామిలీని నేడు వైసీపీ అధినేత జగన్ పరామర్శించనున్నారు