సిరా న్యూస్,కడప;
కడప లో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి చెందాడు. దేవర చిత్రం విడుదల సందర్భంగా కడప అప్సర థియేటర్ లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో ప్రదర్శించారు. సినిమా చూస్తున్న క్రమంలో కేకలు వేస్తూ అభిమాని ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడినివెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు సీకే దీన్నే మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలి గా గుర్తించారు.