వధూవరును ఆశీర్వదించిన వేణుగోపాల్ రెడ్డి, విజయమ్మ, మంచూరు
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ మండలం కేశంపల్లి గ్రామానికి చెందిన సీఎం సుబ్బారెడ్డి తమ్ముడు విజయ భాస్కర్ రెడ్డి, ఇంద్రావతి ల కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, వివాహ వేడుక బద్వేల్ చెన్నంపల్లి ఆర్ఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మట్లి వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు మంచూరు సూర్యనారాయణ రెడ్డి, మండల సీనియర్ నాయకులు నందగోపాల్ రెడ్డి, అట్లూరుమండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, రైల్వే కాంట్రాక్టర్ అరవ శ్రీనివాసులు రెడ్డి, రైల్వే కాంట్రాక్టర్ ఉ పత్తి రామకృష్ణారెడ్డి వధూవరులైన విష్ణువర్ధన్ రెడ్డి, శృతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. రైల్వే కాంట్రాక్టర్ సీఎం సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, వారి తనయుడు యువ నాయకుడు రితీష్ రెడ్డి లకు చాలా ఏళ్లుగా వ్యక్తిగత సొంతింటి కుటుంబ సభ్యునిగా ఈ ప్రాంత వాసులందరికీ సుపరిచితుడే .ఈ వివాహ వేడుకలకు మట్లి వేణుగోపాల్ రెడ్డి, వారి బ్రదర్స్ నారాయణరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు , జెడ్పిటిసి జయరాం రెడ్డి, రిటైర్డ్ ఈఈ రాజగోపాల్ రెడ్డి, పోల్ రెడ్డిరాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వైసిపి, కూటమి నాయకులు, పార్టీలకు అతీతంగా హాజరు కావడం విశేషం. సీఎం సుబ్బారెడ్డి, భాస్కర్ రెడ్డి రుచికరమైన నాన్ వెజ్ భోజనం సుమారు 2000 మందికి ఏర్పాటు చేశారు.