సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
పెద్దపల్లి జిల్లా ఓదెల సీతారామాలయం సన్నిధిలో ఓదెల వాల్మీకి బోయ గ్రామ సంఘం అధ్యక్షులు బొగే సదానందం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బోగే సదానందం మాట్లాడుతూ వాల్మీకి బోయ కులాన్ని బీసీఏ లో చేర్చాలని అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు బోగే సదానందం, కార్యదర్శి మీనుగు సంతోష్, కోశాధికారి మీనుగు రమేష్, బోగే కుమార్ మండల రాజు, బోగె నవీన్ బోగే, కుమారస్వామి, సోగల ప్రవీణ్, బోగె శ్రీనివాస్, మండల శ్రీనివాస్, కుడుదల సతీష్, మీనుగు రాకేష్, బోగే సాయి, ఉజ్జెతుల అజయ్, బోగే సందీప్, తదితరులు పాల్గొన్నారు.