సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో నాగుల చవితి వేడుకలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల ప్రజలు మంగళవారం నాగుల చవితి వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా మండల కేంద్రంలో శ్రీ పార్వతి శంభు లింగేశ్వర స్వామి ఆలయం దగ్గర్లో ఉన్న పుట్టలో పాలు పోసి నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చల్లంగా చూడయ్యా నాగరాజు అని వేడుకున్నారు.