దుర్గామాతకు వెండి నెమలి బహుకరణ

సిరా న్యూస్,ఇంద్రకీలాద్రి;
భక్తులకు కొంగు బంగారంగా… ఇంద్రకీలాద్రిపై వెలసిన జగజ్జననికి శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తితో కానుకలు సమర్పించిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని ఎంతోమంది భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పిస్తుంటారు. గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే దుర్గామాత భక్తుడు వెండితో తయారు చేయబడిన నెమలిని శనివారం జగన్మాతకు బహుకరించారు. ఈ బహుమతిని అందజేసిన దాతలకు ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్. రామారావు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దాతలకు శేష వస్త్రంతో పాటు, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *