జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.సోమవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లా వ్యాప్తంగా పలు సమస్యలతో కూడిన 17 దరఖాస్తులు ప్రజావాణిలో వచ్చాయని తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖలు పరిష్కరించేందుకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. రాష్ర్ట స్థాయి నుండి జిల్లాకి సంబంధించి వచ్చిన ప్రజావాణి దరఖాస్తులు అలాగే జిల్లాస్థాయిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పరిష్కారానికి ప్రతి శాఖలో ప్రత్యేకంగా నోడల్ అధికారులు నియమించాలని, దరఖాస్తు పరిష్కార వివరాలు వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.
మండల స్థాయిలో ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నామని, మండల పరిధిలోని సమస్య అయితే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, ఆర్డీవో మంగిలాల్, ఈ.డి.ఏం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
==========================