సిరా న్యూస్,కమాన్ పూర్;
రామగిరి మండలం బేగంపేటలో గురువారం ఆయా విభాగాల అధికారిలు పర్యటించారు.గ్రామానికి చెందిన దాసరి శివ ఫిర్యాదు మేరకు కమ్మరివాడలో పర్యటించిన అధికారులు మురుగునీటి కాల్వపై నెలకొన్న వివాదం గురించి ప్రజలతో మాట్లాడారు.ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపైన కఠిన చర్యలుంటాయని కాలువ నుండి మురుగుననీరు బయటకు వెళ్లకుండా ఆటంకపరిచేవారికీ గ్రామపంచాయతీ నుండి నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డి.ఎల్.పివో సతీష్ హెచ్చరించారు.ఐదు రోజుల్లో డ్రైనేజీ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు.అనంతరం గ్రామంలోని బొంతలవాడతో పాటు ఇతర వార్డులను సందర్శించారు సమస్యలను పరిష్కారించాలని సూచించారు.కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాంచందర్ రావు ఎంపివో ఉమేష్ కార్యదర్శి రత్నాకర్ లు పాల్గొన్నారు.