ఒక నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల;
వ్యక్తి హత్యకు కారణమైన ఇద్దరు నిందితులలో ఒకరికి జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమానా, మరొ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత బుధవారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
కేసు వివరాలు
ముస్తాబాద్ గ్రామానికి చెందిన పండుగ రాజం అనే వ్యక్తికి అయన అక్క పండుగ మరియమ్మ కి ఆస్తుల పంపకాల గురించి గొడవలు వున్నాయి. ఈ క్రమం లో 2020 ఏడాది పండుగ మరియమ్మ, ఆమె కుమారుడు న పండుగ మల్లేశం లు పండుగ రాజం ను గొడ్డలితో నరికి చంపారు,. ఈ సంఘటనపై అప్పటి సిరిసిల్ల రూరల్ సిఐ సర్వర్ కేసు నమోదు చేసి పండుగ మరియమ్మ, పండుగ మల్లేశం ను రిమాండ్ కు తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో 15 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగరావు వాదించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందుతురాలు పండుగ మరియమ్మ కి పది సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 2500 రూపాయల జరిమానా, మరొక నిందితుడైన పండుగ మల్లేశం కు జీవిత ఖైదు జైలు శిక్ష తో, 2500 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.