వెంకటగిరి పోలేరమ్మ అమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కందుల దుర్గేష్
జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
సిరా న్యూస్,తిరుపతి;
వెంకటగిరి పోలేరమ్మ జాతరను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 26న నిర్వహించనున్న పోలేరమ్మ జాతరలో పోలేరమ్మ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారిని నియమించినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ జీవో 655 విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. వెంకటగిరి పోలేరమ్మ జాతరలో వారు రేపు సెప్టెంబర్26న ఉదయం 11.00 గంటలకు పాల్గొని అత్యంత వైభవంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అని కలెక్టర్ తెలిపారు.