సిరా న్యూస్,ఏలూరు;
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నడిచి వెళుతున్న భవానీల బృందంపై లారీ దూసుకు వెళ్లింది. ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు భవానీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. వారిని 108 అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితులు విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి గ్రామం నుంచి విజయవాడకు నడిచి వెళుతున్నారు. మృతుడు గొర్రెల నాని (28)గా గుర్తించారు. నల్లజర్ల పోలీసులు విచారణచేస్తున్నారు.