One Srinivas… ఒక్కచోటుకి చేరిన శ్రీనివాసులు

సిరా న్యూస్,కరీంనగర్;
శ్రీనివాస్ పేరుగల వారంతా ఏకతాటిపైకి వచ్చారు. కరీంనగర్ కు చెందిన వుట్కూరి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో మిత్రబృందంగా ఏర్పడ్డారు. శ్రీనివాస్ పేరుతో పదిమందితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఆ పేరు గల వారిని అందులో చేర్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4800 మంది శ్రీనివాసులు అయ్యారు.మూడు వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి మానవ సేవే మాధవ సేవగా భావిస్తు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి (టిఎస్ఎస్ఎస్) రిజిస్టర్ చేసి ఏడాది పూర్తైన సందర్భంగా కరీంనగర్ లోని టిటిడి కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.తలసేమియా బాధితల కోసం వందమంది రక్తదానం చేశారు. ఎస్పీ స్థాయిలో ఉన్న కరీంనగర్ పోలీస్ ట్రేనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రక్తదానం శిబిరాన్ని ప్రారంభించగా వందమంది శ్రీనివాసులు రక్తదానం చేశారు. రక్త ధానమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.శ్రీనివాస్ పేరు గలవారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4800 మంది ఉన్నట్లు గుర్తించారు. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 వేల మంది శ్రీనివాసులు ఉన్నట్లు భావిస్తున్నారు. వారందరినీ టిఎస్ఎస్ఎస్ లోకి చేర్పించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. శ్రీనివాస్ పేరు గల వారు పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేయుత అందించాలని, అదేవిధంగా సాటి మనిషికి సహాయపడే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.శ్రీనివాస్ పేరు గలవారు వివిధ రంగాల్లో ఉన్నారు. డాక్టర్లు ఇంజనీర్లు, ఉద్యోగులు, వ్యాపారులు,దినసరి కూలీలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఇలా శ్రీనివాస్ నామధేయం గల వారందరిని టిఎస్ఎస్ఎస్ గొడుగు కిందకు తెచ్చేందుకు వుట్కూరి శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు సమావేశానికి హాజరైన శ్రీనివాసులు. రాబోయే రోజుల్లో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, పేదలను ఆదుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.మొదటి వార్షికోత్సవం సందర్భంగా 3000 మందితో సమావేశం నిర్వహించిన శ్రీనివాసులు వచ్చే ఏడాది వరకు 10000 మంది శ్రీనివాసులతో సమావేశం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్వాహకులు శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆచార్య దైవజ్ఞ శ్రీనివాస్ కాళేశ్వరం గారి ఆలోచనకు అనుగుణంగా శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో శ్రీనివాస్ నామదేయులు ఒక్క వేదిక పైకి రావడం గొప్ప విషయమన్నారు పిటిసి ప్రిన్సిపల్ శ్రీనివాస్. దీనిని ముందుకు తీసుకుపోవడానికి మన ఆరోగ్యం మన చేతులో అనే నినాదంతో చిరుధాన్యాలను ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *