సిరా న్యూస్,వరంగల్;
ఓరుగల్లు కాంగ్రెస్ నాయకుల వర్గపోరు మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. తలోదారి..ఎడమొఖం, పెడముఖం వ్యవహారంతో సీఎం జిల్లాకు వచ్చినా జోషే కనిపించిలేదట. వచ్చిన జిల్లా ఎమ్మెల్యేలు కూడా వచ్చామా అంటే వచ్చాం వెళ్లామా అంటే వెళ్లాం అన్నట్లుగా నడుచుకున్నారట. మంత్రి కొండా సురేఖపై తిరుగుబాటు చేసిన వారంతా ఆమెతో పలకరించేందుకు కూడా పెద్ద ఆసక్తిచూపలేదు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అయితే మంత్రి కొండా సురేఖ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడలేదువరంగల్ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకే సీఎం రేవంత్ వరంగల్ వెళ్లారు. ఏ ప్రొగ్రామ్‌లో పాల్గొనేందుకు వచ్చినా సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలకడం కామన్. కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం తమ వ్యక్తిగత కారణాలు, గొడవలు, ఇగోలతో..ఏకంగా సీఎంనే లైట్ తీసుకున్నట్లు కనిపించింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం ఓరుగల్లు పర్యటనలో ఎక్కడా కనిపించలేదు.వరంగల్ వెస్ట్ సీటు విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి మధ్య గ్యాప్ ఉంది. అప్పటి నుండి వీరిద్దరూ ఎడాముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఆ కారణంతో ఆయన సీఎంకు స్వాగతం పలికేందుకు కూడా రాలేదట. మరోవైపు మంత్రి సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తన నియోజకవర్గంలో మంత్రి అనవసర జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే.. తన అనుచరులను ఎమ్మెల్యే వర్గం ఇబ్బంది పెడుతోందని మంత్రి ఆ మధ్య గొడవ పడ్డారు. ఆ ఇష్యూ ఏఐసీసీ వరకు వెళ్లింది. ఆ గ్యాప్‌తో ఆయన సీఎంకు స్వాగతం పలికేందుకు వచ్చినా మంత్రి కొండా సురేఖకు మాత్రం ఎదురెదురు పడలేదు.ఇక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అయితే ఏకంగా సీఎం రేవంత్ అంటేనే గిట్టడం లేదట. ఈ పది నెలల కాలంలో ఆయన ఎప్పుడూ సీఎంను కలవలేదు. పార్టీ యాక్టివిటీలో కనిపించడం లేదు. అందుకే ఆయన సీఎం టూర్‌కు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కరి ఒక్కో రీజన్ కావొచ్చు. గ్యాప్ ఉండొచ్చు.కానీ సీఎంనే లైట్ తీసుకోవడం ఏంటన్న చర్చ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ మారింది. వ్యక్తిగతంగా నేతల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ..సీఎం వస్తే స్వాగతం పలికేందుకు రాకపోవడం ఏంటని కొందరు గుసగుసలు పెట్టుకున్నారట. అక్కడికి వచ్చిన మంత్రులు కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రాకపోవడంపై ఆరా తీసినట్లు టాక్. ఇలా ఎమ్మెల్యేలు సీఎం పర్యటనలో కనిపించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.సీఎంతో పడక దొంతి మాధవరెడ్డి కార్యక్రమంలో కనిపించకపోవడం సరే. కొండా సురేఖ అంటే గిట్టక రేవూరి ప్రకాశ్‌రెడ్డి గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారనే విషయం అయితే మరోసారి స్పష్టం అయింది. ఇక జంగారాఘవరెడ్డి, నాయినిరెడ్డి రాజేందర్‌రెడ్డి మధ్య పంచాయితీ అందరికీ తెలిసిందే.అయితే సీఎంతో కూడా కొంత గ్యాప్ ఉండటం వల్లే నాయిని రాజేందర్‌రెడ్డి స్వాగతం పలికేందుకు రాలేదన్న టాక్ ఓరుగల్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. మామూలుగానే కాంగ్రెస్ నేతలంటేనే ఎవరికి వారే యమునా తీరే అన్న టాక్ ఉంటుంది. అది మరోసారి ప్రూవ్ అయిందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇప్పటికే ఎమ్మెల్యేల వర్గ విబేధాలతో పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటుంటే..ఇప్పుడు ఏకంగా సీఎంకే స్వాగతం పలికేందుకు కూడా రాకపోవడంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.