Oxford School Indurthi: ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌లో గణిత దినోత్సవం…

సిరా న్యూస్, చిగురుమామిడి:

ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌లో గణిత దినోత్సవం…

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని అక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గణిత శాస్త్రవేత్త రామానుజన్‌ జయంతి సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ కూన సంపత్, ప్రధానోపాద్యాయులు అప్పాల సమ్మయ్యలు రామనుజన్‌ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేట్‌ కట్‌ చేసి, విద్యార్థులకు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్న తనం నుంచే జీవితంలో లక్ష్యాలు నిర్ణయించుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు మంజుల, రూప, రమ్య, సమత, శైలజ, సనా అఫ్రీన్, సంధ్యా, సావిత్రి, మల్లిక్, స్వాగతిక, మైఖెల్, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *