ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ఐటి మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

-మంథని డిగ్రీ కళాశాలలో బిఎఫ్ ఎస్ఐ కోర్సు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు

 సిరా న్యూస్,మంథని;

తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ (బిఎఫ్ ఎస్ఐ) కోర్స్ ను ప్రవేశ పెట్టినందుకు ఎన్ ఎస్ యు ఐ మంథని నియోజకవర్గ కమిటీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతు మంత్రి శ్రీధర్ బాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి హాజరయ్యారు.కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో అత్యుత్తమ కోర్స్ ను విద్యార్థులకు అందిచలన్న మంత్రిగా ఆశయానికి కృతజ్ఞతలు తెలిపారు. మంథని నియోజకవర్గంలోని విద్యార్థులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్ ఎస్ యు ఐ నాయకులు కోరారు. మంథని డిగ్రీ కళాశాలలో బిఎఫ్ ఎస్ఐ కోర్సు ప్రవేశపెట్టడంపై విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర పండుగ, రంగురంగుల పువ్వుల పండగ అయిన బతుకమ్మ పండుగను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ రమా సురేష్ రెడ్డి విద్యార్థినులతో కలిసి బతుకమ్మ లను తీరొక్కపూలతో అందంగా తీర్చిదిద్ది ఆడిపాడారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ మంథని డివిజన్ అధ్యక్షులు కేక్కర్ల సందీప్ గౌడ్ , మండల అధ్యక్షులు జంజర్ల శైలందర్, మున్సిపల్ కౌన్సిలర్స్ గుండా విజయలక్ష్మి పాపారావు, వేముల లక్ష్మి సమ్మయ్య,సీనియర్ నాయకులు మంథని సురేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరుకల రమేష్, నూకల కమల్, సాదుల శ్రీకాంత్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *