సిరా న్యూస్,చిగురుమామిడి
బొమ్మనపల్లి పంచాయతీ కార్యదర్శిగా వేముల నాగరాజు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ నూతన కార్యదర్శిగా వేముల నాగరాజు శుక్రవారం నియామక మయ్యారు. హుజురాబాద్ మండలం చేల్పూర్ గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న వారు బొమ్మనపల్లికి బదిలీపై వచ్చారు.గతంలో ఇంచార్జ్ కార్యదర్శిగా పనిచేసిన స్వర్ణలత కేవలం 14 రోజులు మాత్రమే విధులు నిర్వహించారు.కార్యదర్శికి గ్రామ ప్రజాప్రతినిధులు యువకులు, పుష్పగుచుమిచ్చి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ పెండేల శారద సదానందం, యువ నాయకుడు కత్తుల ప్రవీణ్ యాదవ్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాళ్ల నరేష్, మామిడి రమేష్ మీసేవ, బొల్లి మహేష్ , ఫీల్డ్ అసిస్టెంట్ సత్యం తదితరులు పాల్గొన్నారు.