సిరాన్యూస్,ఇచ్చోడ
ఘనంగా ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ వేడుకలు : ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య
అఖిల భారత ట్రేడ్ కాంగ్రెస్ యూనియన్ 105 వ అవిర్భావ వేడుకలు గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య జెండా ఎగురవేసి ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కల్లెపల్లి గంగయ్య మాట్లాడుతూ 1920 లో మొదటి మహాసభతో ప్రజల సమస్యలను పరిష్కరించేందు కు ఏర్పడిన ఏఐటీయూసీ నేటికి 105 వ ఆవిర్భావ వేడుకలను జరుపుకొందన్నారు. ఆనాడు లాలాలజపతి రాయి అధ్యక్షతన జరిగిన మొదటి మహాసభకు ఎందరో స్వాతంత్ర పోరాట యోధులు తమ సందేశాన్ని పంపారన్నారు. ఆనాటి నుంచి కార్మిక, కర్షక సమస్యలను పోరాడి పరిష్కరిస్తూ వస్తున్న ఏఐటీయూసీ నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడగా దోపిడిలేని సమాజ నిర్మాణ నిర్మాణానికి పోరాడడం తప్పదన్నారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.