సిరా న్యూస్,బేల
దండారి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదివాసుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దండారి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండలానికి చెందిన ఆయా గ్రామాలకు చెందిన దండారి బృందాలకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో అధికారులు, పటేల్‌లు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.