సిరాన్యూస్,ఓదెల
శ్రీ.లక్ష్మి నంబూలాద్రి స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్ద పల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలోని శుక్రవారం శ్రీలక్ష్మి నరసింహ నంబులాద్రి స్వామి వారిని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు దర్శించుకున్నారు. ఈసందర్బంగా దేవాలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.దర్శన అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత గ్రామస్తులు ఎమ్మెల్యే ని ఘనంగా సత్కారించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.