సిరాన్యూస్,సామర్లకోట
దీపం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
అర్హులందరూ దీపం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ వెంకటలక్ష్మి ఆద్వర్యం లో శుక్రవారం 74 వేల 659 మంది లభ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల రామస్వామి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి విత్తనాల వెంకటరమణ, అల్లు ప్రసాద్,లబ్ధిదారులు, అధికారులు, కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.