సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఒక రోగి డ్యూటీ డాక్టర్ పై దాడికి దిగాడు. రోగి మద్యం మత్తులో ఉన్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఈ నేపధ్యంలో జూడాలు సూపరింటెండెంట్ డా. రాజకుమారి ని కలిసారు. వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చరేసారు. కాకపోతే, మా కార్యాచరణ ప్రకటిస్తామని జూడాలు వెల్లడించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన పై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ఆదేశాలిచ్చారు. బందోబస్తును కూడా పెంచనున్నట్లు హామీ ఇచ్చారు.