సిరా న్యూస్ (ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా పెన్‌గంగా నదీ తీరంలో గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచరిస్తుండటంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. జిల్లాలోని తాంసి మండలంలో ఇటీవలే కనిపించిన పెద్ద పులి ఆవులపై దాడి చేసి చంపడం జరిగింది. తాజాగా పక్క మండలమైన జైనథ్‌లోని హట్టిఘాట్ గ్రామం వద్ద పెన్‌గంగా నదీ తీరంలో శనివారం ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. కోర్ట గ్రామానికి చెందిన ఇద్దరు కాపరులు ఆవుల మందను మేతకు పంప్‌హౌజ్ పరిసరాలకు తీసుకెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఆవులు మేస్తుండగా ఒక్కసారి పెద్ద పులి ఆవుల మందపై దాడి చేసి ఒక ఆవు దూడను చంపి తన వెంట తీసుకెళ్లింది. ఈ దాడిలో మరో రెండు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే పెన్‌గంగా నదీ తీరంలో బెబ్బులి సంచరిస్తుండటంతో రైతులు చేన్లకు వెళ్లేందుకు జంకుతున్నారు. పశువుల కాపరులైతే ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పశువులను మేతకు తీసుకెళ్తున్నారు. శనివారం రాత్రి భీంపూర్ మండలం పిప్పల్‌కోటి రిజర్వాయర్ సమీపంలో పెద్దపులి కెమెరాకు చిక్కడటంతో, జనాలు బెంబేలెత్తుతున్నారు.
What a panic condition.. good and informative article