-హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు కొమ్ము మదనయ్య
సిరా న్యూస్,కమాన్ పూర్;
సింగరేణి కార్మికుల ప్లే డే, పీహెచ్డి లపై నియంత్రణ ఎత్తివేయాలని హెచ్ఎంఎస్- నేతలు, కొమ్ము మదనయ్య ఉపాధ్య క్షుడు , క్వాజీ ముహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ కార్యదర్శి పేర్కొన్నారు. యాజ మాన్యం 4 సంవత్సరాల నుంచి అత్యవసర సిబ్బందికి కల్పించే ప్లే డేలు, పీహెచ్డీలు , ఎన్-మైనస్- వన్ పేరుతో నియంత్రించడాన్ని హెచ్ఎం ఎస్ వ్యతిరేకిస్తుదన్నారు. కార్మిక సంఘాలు వ్యతిరేకించినప్పటికీ యాజమాన్యం స్పందించి పరిష్కరించడం లేదని ఆరోపించారు. ఏఐ టీయూసీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అత్యవసర సిబ్బందికి కల్పించే ప్లే డేలు, పీహెచ్డీ లు( చెల్లింపు సెలవులు )పాత పద్ధతిలో ఇప్పించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు బాధ్యత తీసుకొని పరిష్కరించాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే కార్మికుల పక్షాన రామగుండం ప్రాంతం నాయకులు హెచ్ .ఎమ్.ఎస్.పోరాడుతుందని కె. వీరయ్య, మల్లారెడ్డి, పెసర స్వామి , సత్యనారణ , మహిపాల్ రెడ్డి , మహమూద్ ఖాన్ తదితరులు పేర్కొన్నారు.యూనియన్ సభ్యత్వం 500 వందల రూపాయలు సంస్థ కార్మికులు, హెచ్ఎంఎస్- యూనియన్ కు కట్టాలని కోరారు.