సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని రామారావు పేట లో మందు పార్టీ చేసుకుంటూ పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారు. ఈ సమాచారం పోలీసులకు తెలిసింది .తొలుత క్రైమ్ సీఐ కృష్ణ బృందం దాడి చేసింది .
ఇది టూ టౌన్ పరిధిలో ఉండడంతో టూ టౌన్ సి ఐ చేరుకోవడంతో క్రైమ్ సీఐ బృందం వెళ్లిపోయింది.పేక ఆడుతున్నవారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పటికీ రాజకీయ ఒత్తిడి మేరకు ఎలాంటి కేసులు పెట్టకుండా పోలీసులు వదిలేసినట్లు సమాచారం. భారీ ఎత్తున నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పేకాట రాయుళ్ల నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.