సిరా న్యూస్,సూర్యాపేట;
గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు నమోదమయింది. జీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పై బుల్డోజర్ ఎక్కించి చంపుతానని బెదిరించినందుకుగాను, క్రిమినల్ కేసు నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావు పై బుల్డజర్ ఎక్కించి చంపుతానని, బెదిరించి నందుకు సీఎం పై పోలీస్ స్టేషన్ పిర్యాదు చేయడం జరిగింది. సీఎం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి కి న్యాయం జరగక రోడ్డు మీద ధర్నా చేసిన పరిస్థితి చూసాం. సీఎం చేసిన వ్యాఖ్యలు ను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రము లో అరాచక పాలన నడుస్తుంది. హరీష్, కేటీర్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కకి తీసుకోవాలని డిమాండ్ చేసారు. సీఎం స్థాయి లో ఉండి ఇలా మాట్లాడటం సభమేనా. సీఎం పై కేసు నమోదు చేయకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు.