సిరా న్యూస్,మెదక్;
చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మృతదేహం కలకలం రేపింది. చేతికి గోలుసులతో కాలిపోయిన స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వుంది. మృతదేహాన్ని చూసి రోగులు కంగుతిన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎవరైనా హత్య చేసి తగలబెట్టారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాల కోసం పోలీసుల ఆరా తీస్తున్నారు.