సిరా న్యూస్,పుంగనూరు;
పుంగనూరులో చిన్నారి అస్ఫియా మిస్సింగ్ ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్పందించారు. చిన్నారి కుటుంబీకులతో మాట్లాడారు. మూడు రోజులయిన పాప ఆచూకి లభించలేదు. డాగ్ స్క్వాడ్ పసిగట్టిన ప్రదేశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.. 11 ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే అస్ఫియా ఆచూకీని కనబడతామని అన్నారు.