తొమ్మిది మంది అరెస్టు
సిరా న్యూస్,మేడ్చల్;
ఉప్పల్ పారిశ్రామికవాడలో అక్రమంగా డంపింగ్ చేసిన పీడిఎస్ రైస్ ని ఉప్పల్ పోలీసులు పట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొని ఉప్పల్ పారిశ్రామిక వాడలో సుమారు వంద బస్థాలలో నలభై ఐదు క్వింటాలు బియ్యాన్ని దుండగులు డంపింగ్ చేసారు. పిడిఎస్ రైస్ ని, డంపింగ్ ప్రాంతం నుండి గుజరాత్ కి తరలించే క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు డంపింగ్ గోదాంపై పోలీసులు దాడి జరిపారు. తొమ్మిది మందిని అరెస్టు చేసి, నాలుగు ట్రాలీ ఆటోలు, గుజరాత్ కి చెందిన ఒక టర్బో లారీని స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…