తాడేపల్లి ప్యాలెస్ నుంచే గైడెన్స్
సిరా న్యూస్,విజయవాడ;
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను డీఐజీ కోయా ప్రవీణ్ వివరిస్తూ…రాక్షస జాతి చెందిన వారే ఇటువంటి భాషను వాడతారన్నారు. చంద్రబాబు,పవన్, వారి కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన భాషలో పోస్టులు పెట్టారన్నారు.తాడేపల్లి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి.. అసభ్యకర పోస్టులు పెట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐటీ కోయా ప్రవీణ్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, ఇతర నేతలపై అసభ్యకర పోస్టుల కేసులో నిందితును అరెస్టు చేసేందుకు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపడతున్నాయని డీఐటజీ కోయా ప్రవీణ్ తెలిపారు. చంద్రబాబు, పవన్, అనితపై అనుచిత పోస్టుల కేసులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు నిందితులు సుబ్బారెడ్డి, ఉదయ్‌లను అరెస్టు చేశామన్నారు. వీరిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఐజీ కోయా ప్రవీణ్, కడప ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు తెలిపారు.రాక్షస జాతికి చెందిన వ్యక్తుల తరహాలో చాలా అసహ్యమైన భాషలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కుటుంబ సభ్యుల గురించి వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టారని పోలీసులు తెలిపారు. వర్రా రవీందర్ రెడ్డిని సోషల్ మీడియా అకౌంట్ నుంచి మూడు విధాలుగా పోస్టులు పెడుతున్నారు. వర్రా సొంతంగా కొన్ని పోస్టులు పెడితే..తాడేపల్లి కార్యాలయం నుంచి కొన్ని పోస్టులు, ఎంపీ అవినాష్ రెడ్డి పీవీ పంపిన కొన్ని పోస్టులు పెట్టారన్నారు. షర్మిల, వైఎస్ సునీతారెడ్డిపై పెట్టిన పోస్టులు అవినాష్ రెడ్డి పీఏ పంపినట్లు గుర్తించామన్నారు. అవినాష్ రెడ్డి పీఏ వాట్సాప్ నెంబర్ నుంచి వర్రా రవీందర్ రెడ్డికి ఈ పోస్టులు వచ్చాయన్నారు. అవినాష్ రెడ్డి చెబుతుంటే ఆయన పీఏ ఈ వివరాలు రాసుకుని…వర్రాకు పంపేవారని తెలిసిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. అలాగే వైఎస్ సునీతారెడ్డి హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారని, ఆమె ఏపీలో ఫిర్యాదు చేస్తే ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తామన్నారు.”సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై నిందితులు వాడిన భాష చాలా అసభ్యకరంగా ఉంది. అరబ్ దేశాల్లో అయితే వీరికి తీవ్ర శిక్షలు ఉంటాయి. వర్రా రవీందర్ రెడ్డి గతంలో భారతి సిమెంట్స్‌లో పనిచేశాడు. ఈ కేసులో అరెస్టైన మరో ఇద్దరు కూడా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైసీపీ అనుకూలంగా వాడుకుని ప్రత్యర్థులపై పోస్టులు పెట్టారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. వీరిలో కొందరు జడ్జిలకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారు. ఇలాంటి వారిని 45 మందిని గుర్తించారం. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు పెట్టాం. నిందితులు రాక్షస జాతికి చెందిన వాళ్లలా పోస్టులు పెట్టారు. కుటుంబ సభ్యులు, పిల్లల గురించి అత్యంత నీచమైన భాషలో పోస్టులు పెట్టారు”- డీఐజీ కోయా ప్రవీణ్నిందితులకు 40 యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నట్లు గుర్తించామని డీఐజీ ప్రవీణ్ తెలిపారు. నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేసి అనుచితంగా వీడియోలు, పోస్టులు పెట్టేవారన్నారు. వీరికి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచి మార్గనిర్దేశం చేసేవారన్నారు. తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచి వచ్చిన పోస్టులు వీరు సోషల్ మీడియాలో పెట్టేవారు. సభ్య సమాజం తలదించుకునేలా, చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారన్నారు. మహిళలపై ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని రాక్షసజాతికి చెందినవారిగా భావిస్తున్నామని డీఐజీ ప్రవీణ్ అన్నారు. పూర్వం రాక్షసులు మహర్షుల యాగాలను భగ్నం చేసేందుకు రక్తం వేసేవారని, అలాంటి రాక్షస జాతికి చెందిన వారు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు.