సిరాన్యూస్, చిగురుమామిడి
రక్తదానం చేసిన ప్రణథి ఫౌండేషన్ మెంబర్ బోయిని ఉమేష్
ఓ పేషెంట్ కి ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా రక్తం అవసరం కాగా ప్రణథి ఫౌండేషన్ మెంబర్ బోయిని ఉమేష్ రక్త దానం చేసి నిండు జీవితాన్ని నిలబెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన కొందరు యువకులు సామాజిక సేవతోనే మనం జీవిస్తున్న ఈ సమాజానికి మనవంతు కొంత సహాయం అందించగలం అని ప్రణథి ఫౌండేషన్ ను స్థాపించారు. ఫౌండేషన్ ద్వరా గ్రామంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళవారం ప్రణథి ఫౌండేషన్ మెంబర్ బోయిని ఉమేష్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో ఓ పేషెంట్ కి ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా రక్తం అవసరం ఉందని వైద్యులు తెలిపారు.విషయం తెలియగా స్పందించిన ఉమేష్ అక్కడికి చేరుకుని రక్తదానం చేశాడు. ఇలా రక్తం దానం చేయడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ఉమేష్ ఆరు సార్లు పలు సందర్భాల్లో రక్తదానం చేశానని తెలిపాడు.ఈ సందర్భంగా ప్రణథి ఫౌండేషన్ మెంబర్స్ పిల్లి తిరుపతి,కుమ్మము నవీన్,బోయిని సంపత్,వంశీకృష్ణ ఉమేష్ ను అభినందించారు.