సిరాన్యూస్, ఓదెల
అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలి : డీపీఓ వీర బుచ్చయ్య
ప్రభుత్వ అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తూ.. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య అన్నారు. మంగళవారం ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్, వివిధ గ్రామాల కరోబార్ లు , మంచినీటి సహాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా డీపీఓ మాట్లాడుతూ ప్రతిరోజు ఇంటింటికి ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేపట్టాలన్నారు. గ్రామంలోని సిగ్రిగేషన్ షెడ్ యూజింగ్, కంపోస్ట్ తయారీ, గ్రామంలో ప్లాస్టిక్ కలెక్షన్ చేయుట, గ్రామంలో ఇంటి పన్ను కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్, ఇంటి నిర్మాణ అనుమతులపై, మంచినీటి ట్యాంకులు శుభ్రపరచడం, గ్రామీణ మంచినీటి సరఫరా పై సమీక్షించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. తిరుపతి ,మండల పంచాయతీ అధికారి , మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఏఈలు తదితరులు పాల్గొన్నారు.