బ్యాలెట్ తోనే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది

– మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్
సిరా న్యూస్,హైదరాబాద్;
బ్యాలెట్ పేపర్ తో ఎన్నికల నిర్వహించడం ద్వారానే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్న అమెరికా వంటి అగ్ర రాజ్యాలు సైతం వారి ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుతెరగాలని అన్నారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఆందోళన గురిచేస్తుందని అన్నారు. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న ఎన్నికలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. మూసి ప్రక్షాళన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మంచిదేనని మేధావులు, ఆయా రంగాల నిపుణులతో విస్తృతంగా చర్చించి ముందుకు వెళితే బాగుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నానాటికి దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబు తిరుపతి లడ్డు విషయంలో తప్పుగా మాట్లాడి ఆయన ఇమేజ్ ను తగ్గించుకున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశంలో తీవ్ర అలజడి నెలకొనే ప్రమాదం ఉందని అన్నారు. పాలకులు ప్రజలకు మెరుగైన పాలన అందించే అంశంపై దృష్టి సాధించాలని సూచించారు. దేశంలో పెరుగుతున్న ధరల్లోను తగ్గించి పేదలకు ఆహార ధాన్యాలు తక్కువ ధరలకు అందెల చూడాలని కోరార.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *