వరదల మధ్య గర్భిణికి ప్రసవం..

హెలికాప్టర్ ద్వారా రక్తం రవాణా
సిరా న్యూస్,ముంబాయి;
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భామ్రగఢ్ తహసీల్లో పరిస్థితి ఘోరంగా తయారైంది. వర్షాల వల్ల అనేక రోడ్లు మూసుకుపోయాయి. ఆ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. అయితే అక్కడ ఓ గర్భిణీ పరిస్థితి విషమంగా మారింది. ఆమెకు అత్యవరంగా రక్తం అవసరం పడింది. దాంతో అధికారులు మహిళ ప్రాణాలను కాపాడేందుకు హెలికాప్టర్లో రక్తాన్ని అందించారు. ఈ ఘటన గడ్చిరోలిలోని భామ్రాగఢ్ తహసీల్ లో చోటు చేసుకుంది. ఇక్కడ వరదల నుంచి బయటకు వచ్చిన ఓ గర్భిణికి వైద్య బృందం ప్రసవం చేసింది. ఒక యూనిట్ రక్తాన్ని ఎక్కించిన తర్వాత, ఆమెకు ఒక బ్యాగ్ ఎక్కువ రక్తం అవసరమైంది. కానీ., వరద కారణంగా రోడ్లన్నీ మూసుకుపోయాయి. ఆ పరిస్థితిలో వర్షం ఆగిన తరువాత ఉదయం హెలికాప్టర్ ద్వారా రక్తాన్ని పంపిణీ చేశారు. మంటోషి గజేంద్ర చౌదరి అనే మహిళ ప్రసవ వేదనతో భమ్రాగఢ్ లోని గ్రామీణ ఆసుపత్రిలో చేరింది. ఇక్కడ వైద్యులు డెలివరీ నిర్వహించారు. ఆ తర్వాత ఆమెకు రక్తం అవసరమైంది. మహిళకు రక్తపు సంచి దొరికినా అది సరిపోలేదు. దాంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.వర్షం, వరదల కారణంగా బయటి నుంచి ప్రయాణించే అవకాశం లేదు. ఇక్కడ వరదల కారణంగా చాలా గ్రామాలతో కనెక్టివిటీ పోయింది. పారల్కోట నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ మొత్తం విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత హెలికాప్టర్లో రక్తాన్ని తీసుకునేందుకు సన్నాహాలు చేయగా, ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ద్వారా రక్తం తీసుకురావడం కష్టంగా మారింది. చివరకు వాతావరణం అనుకూలించడంతో ఆరోగ్య కార్యకర్తలు గడ్చిరోలి నుంచి రక్తం తీసుకుని భామ్రాగఢ్కు బయలుదేరారు. ఇందుకోసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీలోత్పాల్ జిల్లా పోలీసు బలగాల హెలికాప్టర్ను అందుబాటులో ఉంచారు. వరద బీభత్సం మధ్య సత్వరం స్పందించిన వైద్య బృందం రక్తంతో వచ్చి మహిళ ప్రాణాలను కాపాడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *