Principal Dharmanna: విద్యార్థుల్లో శాస్త్రీయ నైపుణ్యం పెంచాలి: కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపాల్ ధర్మన్న

సిరాన్యూస్‌, ఇచ్చోడ‌
విద్యార్థుల్లో శాస్త్రీయ నైపుణ్యం పెంచాలి: కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపాల్ ధర్మన్న

విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికే క్షేత్ర ప‌ర్య‌ట‌న చేప‌ట్టిన‌ట్లు కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపాల్ ధర్మన్న అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన కృష్ణవేణి పాఠశాల విద్యార్థులకు ఆధునిక నాగరికత, మాయమవుతున్న కులవృత్తులు, పల్లెలే పట్టణానికి పట్టుకొమ్మలు అనే అంశంపై విద్యార్థులు మండలంలోని ముఖరా (కే) గ్రామానికి వెళ్లి అక్కడ తడి చెత్త ద్వారా తయారుచేసిన వర్మి కంపోస్ట్, సామూహిక మరుగుదొడ్లు, పల్లె ప్రకృతి వనం, ఇంకుడు గుంతలు, తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుండి నేరేడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి వెళ్లి కుమ్మరిలు మట్టితో పాత్రలు, కుండలు ఎలా తయారు చేస్తారు అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ధర్మన్న మాట్లాడుతూ. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే విద్యార్థులను ఆ గ్రామాలకు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్టణానికి వెళ్లి కూలీగా పనిచేస్తున్నారు. కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉందన్నారు. విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని పాఠశాలలు మరింత బలోపేతంచేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నామని ప్రిన్సిపాల్ ధర్మన్న చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *