సిరాన్యూస్, ఓదెల
దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి: దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్
* మంథని- రామగిరి -కాలేశ్వరం సర్క్యూట్ అభివృద్ధి చర్యలు
* గౌతమేశ్వర ఆలయం వద్ద 2027 పుష్కరాల నిర్వహణ
* కళా భారతి నిర్మాణానికి స్థలం గుర్తింపు
మంథని ప్రాంతంలోనే దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు. మంగళవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మంథని లోని మహా లక్ష్మి దేవాలయంలో దేవాదాయ, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంత రావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌతమేశ్వర దేవాలయాన్ని పురావస్తు శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం పురపాలక కార్యాలయంలో దేవాలయాలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.