సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం గ్రామంలో విషాదం నెలకొంది.పిడుగుపాటుకు గురై ఇద్దరు యువతులు మృతి చెందారు.
గ్రామానికి సమీపంలోని అరటి తోటలో పనికి వెళ్ళిన క్రమంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తోటలో పనిచేస్తున్న క్రమంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో బయటకు వచ్చిన కూలీలు ఆటో కోసం వేచి చూస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో సున్నం అనూష,కట్టం నాగశ్రీ లు అక్కడికక్కడే మృతిచెందగా రాజమ్మ,సీతమ్మ,రత్తమ్మ అనే ముగ్గురు మహిళ కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లిలోని ప్రైవేట్ హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందటంతో గ్రామంలో విషాదం నెలకొంది..