సిరా న్యూస్,బద్వేలు;
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని లాబ్ రిపోర్టులు తెలియజేస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో లడ్డులో రుచి తగ్గిందని, సైజు తగ్గిందని, ధర పెరిగిందని, వసతి సౌకర్యం ఇచ్చే రూముల అద్దెలు, దర్శన టికెట్ల ధరలు, ప్రత్యేక దర్శనములు, స్వామివారి కళ్యాణము సేవల టికెట్ల ధరలు విపరీతంగా పెంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ పేపర్లలో టీవీలలో, సోషియల్ మీడియాలో హిందువులమైన మనం వింటున్నాం, చూస్తున్నాం. రోజుకు కోట్ల రూపాయలు హిందూ భక్తుల నుండి వస్తున్నా ప్రసాదంలో కూడా గత పాలకులు డబ్బుకు కక్కుర్తిపడి ఘోరమైన మహాపరాధం చేస్తారని ఊహించలేకపోయామని అన్నారు.