సిరాన్యూస్, బేల
ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గెలిపించండి : పీఆర్‌టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూటీఎస్ అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిని గెలిపించాలని పీఆర్‌టీయూటీఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్ అన్నారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని వివిధ పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత గల అందరూ ఉపాధ్యాయులు ఓటరు నమోదు చేసుకోవాలని పీఆర్‌టీయూటీఎస్ అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కోల నర్సింహులు, ఆరె భాస్కర్ రాష్ట్ర కార్యదర్శి పతాని స్వామి, జిల్లా కార్యదర్శిగా మదన్ లాల్ మండల అధ్యక్షులు ఎస్. దేవ్ రావు, ప్రధాన కార్యదర్శి క్. నితిన్ కుమార్ పాల్గొన్నారు.