సిరా న్యూస్,మేడ్చల్;
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ కార్యక్రమం పటాన్చెరు నియోజకవర్గ ప్రారంభమైంది. నియోజకవర్గంలోని మూడు జిహెచ్ఎంసిలు మూడు మున్సిపాలిటీలు 4 మండల కేంద్రాలలోని గ్రామాలలో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మండల, గ్రామ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు అన్ని గ్రామల్లో మునిసిపల్ GHMC పరిధిలో ఈ కార్యక్రమం జరుగనుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం మండల్ గ్రామం పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారి డి ఎల్ పి ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలకు ప్రతి ఒక్క లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని రేషన్ కార్డు ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరణి అంతి రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి ,ఎంపీపీ సుష్మ శ్రీ,ఎంపీడీఓ బన్సీలాల్, ఎలక్ట్రికల్ ఏఈ మణికంఠ,గ్రామపాలకవర్గా సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.