సిరా న్యూస్, డిజిటల్:
రేపటి నుంచి నో పెట్రోల్.. నో డీజిల్.. నిజమేనా?
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న భారతీయ న్యాయ సంహితలో “హిట్ అండ్ రన్” కేసులకు 10 సంవత్సరాల జైలు శిక్షా, రూ. 7 లక్షల జరిమాన విధించే విధంగా నిబంధనలు చేర్చడం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నే పథ్యంలో లారీలు, ట్రక్కుల యజమానులు, డ్రైవర్లు ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో సమ్మెకు దిగారు. దీంతో రేపటి నుంచి పెట్రోల్, డీజీల్ కొరత అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద జనాలు క్యూకడుతున్నారు.
ఏమిటీ నిబంధనా? ఎందుకీ ఆందోళన?
హిట్ అండ్ రన్ అంటే… ఒక వహానం ప్రమాదం చేసి అక్కడి నుంచి పారిపోవడం అని చెప్పవచ్చు. అంటే ప్రమాదానికి కారణమైన వహాన డ్రైవర్, కనీస బాధ్యతను మరిచి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం, బాధితులకు నష్టపరిహారం అందించడం వంటివి చేయకుండా, సంఘటన స్థలం నుంచి పారిపోవడం అని చెప్పవచ్చు. దీని వలన రోడ్డు ప్రమాదాలకు గురైనవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలో ఇలాంటి కేసులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమాన విధించడం సబబేనని మేధావి వర్గం భావిస్తున్నది. అయితే లారీలు, ట్రక్కులు, ఆటోలు, ఇతర వహానాల యజమానులు, డ్రైవర్లు మాత్రం దీనికి తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సమ్మెలకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది.
పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూలైన్…
పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే ట్యాంకర్ల యజమానులు సైతం సమ్మెలో పాల్గొనడంతో తెలంగాణలో రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ కొరత అంటూ వార్తలు రావడంతో జనాలు అప్రమత్తమయ్యారు. ఏ పెట్రోల్ బంక్ వద్ద చూసిన భారీ క్యూలైన్లు ఉండటంతో, కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్‌లు దర్శనమిచ్చాయి. కొన్ని బంక్‌లలో క్యాన్‌లతో సైతం జనాలు వరుసలో నిల్చున్నారు.
తెలంగాణలో సమ్మె విరమణ…!?
తెలంగాణలో లారీ డ్రైవర్‌ల యజమానులు సమ్మె విరమించినట్లు అధికారులు తెలిపారు. ఎవరూ కూడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెట్రోల్‌కు గానీ డీజిల్‌కు గానీ ఢోకా లేదని ఆయా జిల్లాల్లో అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. దీంతో తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత తప్పిందనే చెప్పవచ్చు. ప్రజలు ఎవరూ కూడ బంక్‌ల వద్ద పడిగాపులు కాసే పనిలేదని, పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.