తెలంగాణలో రాడార్ రాజకీయం….

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కథ చాలా పెద్దదే. అయితే ఈ రాడార్ స్టేషన్ వద్దే వద్దు అని బీఆర్ఎస్ వాదిస్తోంది. సముద్రమే లేని తెలంగాణలో అసలు నేవీ రాడార్ స్టేషన్ అవసరమా? అడవిని నరికి కట్టడం ఎంత వరకు కరెక్ట్? రేడియేషన్ తో జనమంతా ఏమైపోవాలి? ఇలాంటి ప్రశ్నలను గత పదేళ్లు అధికారంలో ఉండి అన్ని అనుమతులు ఇచ్చిన వారు ప్రశ్నిస్తున్న మాట. తీరా కథ క్లైమాక్స్ కు వచ్చే సరికి మాత్రం ప్లేట్ ఫిరాయించడమే అసలు ట్విస్ట్. ఏదో జరగరానిది జరిగిపోతోందన్న సీన్ క్రియేట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు గులాబీ నేతలు.దామగుండం నేవీ రాడార్ స్టేషన్ నమూనా ఇది. అడవికి పెద్దగా నష్టం లేకుండా.., పల్లెలను, జనాన్ని డిస్టర్బ్ చేయకుండా వస్తున్న ప్రాజెక్ట్ ఇది. కానీ ఏదో జరగరానిది జరిగిపోతోందని బీఆర్ఎస్ నేతలు వాదనలు వినిపిస్తున్నారు. అడ్డుకుంటాం, పోరాటాలు చేస్తాం.. తిరగబడుతాం అని డైలాగ్ లు కొడుతున్నారు. ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రెండూ కంప్లీట్ అపోనెంట్స్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం అయితే గనుక కాంగ్రెస్ ప్రభుత్వం నేవీ రాడార్ స్టేషన్ కు నో చెప్పేయాలి. మాకు వద్దే వద్దు అని తెగేసి చెప్పాలి. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఇక్కడ దేశ ప్రయోజనాలు ముఖ్యం. అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగకుండా చూసుకోవడం ముఖ్యం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి దామగుండం నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుపై చొరవ తీసుకున్నారు. కానీ ఆశ్చర్యంగా గత పదేళ్లలో అన్ని రకాల అనుమతులు ఇచ్చి, జీవోలు రిలీజ్ చేసిన బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు రాజకీయం చేసే పనిలో ఉన్నారు. సో ఇక్కడ దూద్ కా దూద్, పానీకా పానీ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ దామగుండం విషయంలో రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే మొదటి ఆప్షన్ ఉండేది. కానీ ప్రతీది రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. దేశ రక్షణ అవసరాలు కూడా ముఖ్యమే. ఇదే సూత్రంతో కాంగ్రెస్ సర్కారు నేవీ రాడార్ స్టేషన్ కు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అంతటా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే అదీ ఉండాలి. ఇదీ ఉండాలి. అంటే రాడార్ స్టేషన్ అవసరం. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కూడా అవసరమే. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అటు నేవీ, ఇటు రాష్ట్ర అటవీ శాఖ పక్కాగా రాడార్ స్టేషన్ కు ప్లానింగ్ చేశాయి. డిజైన్ చూస్తేనే మ్యాటర్ చాలా వరకు అర్థమవుతుంది కూడా.దామగుండంపై ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ చూద్దాం. దామగుండం ప్రాజెక్టుకు దశలవారీగా అనుమతులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ ఇప్పుడు హఠాత్తుగా ప్లేట్ మార్చేశారు. కేటీఆర్ చెబుతున్న విషయాలు ఏంటంటే రాడార్‌ ఏర్పాటుతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నానరు. 2,900 ఎకరాల అటవీ ప్రాంతంలో 12 లక్షల చెట్లను నేలమట్టం చేయబోతున్నారన్నారు. జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్‌ కేంద్రాన్ని తెలంగాణలోనే ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలన్నారు. మూసీ పరిరక్షణ అని చెప్తున్న సీఎం ఆ మూసీనే ప్రమాదంలోకి నెట్టే ప్రాజెక్ట్‌కు ఎందుకు అంగీకరించారో చెప్పాలంటున్నారు. రేడియేషన్ అంటున్నారు. ఇంకా ఏవేవో చెబుతున్నారు. అయితే గత పదేళ్లలో దశలవారీగా అనుమతులు ఇచ్చినప్పుడు ఇవేవీ గుర్తుకు రాలేదా.. ఇది నెంబర్ వన్ పాయింట్. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డు తగిలేలా రాజకీయం చేసే పని పెట్టుకున్నారా..? అయితే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇస్తోంది ప్రభుత్వం.కాబట్టి ఇప్పుడు ప్రశ్నలు సంధిస్తున్న వారికి జవాబులు కూడా రెడీగా ఉన్నాయి. చెట్లు నాశనమవుతున్నాయని, సెన్సిటివ్ జోన్ అని ఏవేవో చెబుతున్నారు. కానీ అలాంటిదేమీ లేదని అటు అటవీ అధికారులు, ఇటు నేవీ ఆఫీసర్లు చెబుతున్న మాట. నిజానికి నేవీ అధికారులు ప్రతి విషయాన్ని లిఖితపూర్వకంగా చెబుతూ వస్తున్నారు. తెలిసి తెలిసి పర్యావరణాన్ని పణంగా పెట్టే పని ఎవరూ చేయరు. అయితే నష్టం తీవ్రత ఎక్కువ లేకుండా చేయడమే ఇక్కడ అసలు పాయింట్. ఓ టౌన్ షిప్ ఏర్పాటవుతుంది. హాస్పిటల్స్, స్కూల్స్ వస్తాయి. లోకల్ గా ఉండే వాళ్లకూ అందులో అవకాశాలు కల్పిస్తారు. దీంతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయిదేశ ప్రయోజనాల కోసం నిర్మితమవుతున్న ప్రాజెక్ట్ ఇది. ఎవరినో ఇబ్బంది పెట్టడం గానీ, ఏవో ప్రయోజనాల కోసమో గానీ జరుగుతున్నది కాదు. అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడం వేరు. ఏదో జరిగిపోతోందని ఊహించుకుని రాజకీయం చేయడం వేరు అంటున్నారు. అటు పర్యావరణ వేత్తలు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *