సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం 4 గంటల నుండి వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. ఉత్తర దిశగా 5 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి 0.5 -1మీ.మీ వర్షం ..20 నిమిషాల పాటు నమోదు, తిరిగి సాయంత్రం 5 గంటలకు ఉత్తర పశ్చిమ దిశగా 5 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి. 0.5-1 మీమీ వర్షపాతం, 10 నిమిషాల పాటు నమోదు. తిరిగి రాత్రి 8 గంటలకు ఉరుములు మెరుపులతో 30 నిమిషాల పాటు 1-2మీ.మీ వర్షపాతం తో భారీ వర్ష సూచన. తిరిగి రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు దక్షిణ దిశగా 5 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి 2-5 మీ.మీ ల భారీ వర్షం కురుస్తుంది. రాత్రి 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దక్షిణ ఈశాన్య దిశగా 5 కిలోమీటర్ల వేగంతో గాలులు వేచి. 2-5 మీ.మీ ల భారీ వర్షం కురుస్తుంది. రాత్రి 11 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు దక్షిణ పశ్చిమ దిశగా 5 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచి 1-2 మీ.మీ ల వర్షం కురుస్తుందని తెలిపారు.