సిరాన్యూస్, ఓదెల
ఈనెల 28న ఇసుక బహిరంగ వేలం: తహసీల్దార్ బి. యాకన్న
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగ ర్తి గ్రామంలో అక్రమ ఇసుకను గుర్తించిన అధికారులు ఇసుకను స్వాధీన పరుచుకొని తహసీల్దార్ ఆవరణలో సుమారు 25 ట్రాక్టర్ల ఇసుక నిల్వ ఉంచారు.ఈ ఇసుకను ఈనెల 28న తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ బి. యాకన్న తెలిపారు.ఈ బహిరంగ వేలంలో మండల ప్రజలు పాల్గొనాలని కోరారు.