Rajaka Sangam Arugula Ganesh: చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి:  రజక సంఘం మండల అధ్యక్షుడు అరుగుల గణేష్

సిరాన్యూస్, ఇచ్చోడ
చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి:  రజక సంఘం మండల అధ్యక్షుడు అరుగుల గణేష్

చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివని, ఆమె సాధించిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగుదామ‌ని రజక సంఘం మండల అధ్యక్షుడు అరుగుల గణేష్ అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) అందరికీ ఆదర్శనీయురాలని అన్నారు. ఆమె అనాడు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యిందని చెప్పారు. ఈ చాకలి ఐలమ్మ ఎన్నో త్యాగాల ఫలితమే తెలంగాణ అని, తెలంగాణ కోసం చాకలి ఐలమ్మ సేవలు మరువలేని అని ఆయన అన్నారు. తెల్ల దొరలను, నిజాం నవాబులను ఎదిరించి పోరాటం చేసిందని కొని యాడారు. యావత్ రజక జాతికే గర్వకారణం ఐలమ్మ ఆని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షుడు నాగరాజ్ దేవరాజ్, కోశాధికారి గంగాధర్, మండల రజక సంఘం సభ్యులు దేవన్న, భూమన్న, శేఖర్, అనిల్, సురేష్, రాజు, ప్రవీణ్, సాయి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *