బాలినేనితో రజనీ రాయబేరం

సిరా న్యూస్,గుంటూరు;
రాజకీయాలు ఎప్పుడు ఎవరిని ప్రత్యర్థులుగా మారుస్తాయో, విడిపోయిన నేతలు తిరిగి ఎప్పుడు కలుస్తారో తెలియదు. బద్ధ శత్రువులుగా ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్న నేతలు ఏదో ఒక సందర్భంలో కలిపోతారు. ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తున్నాయి. మొన్నటిదాకా తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకుని వైనాట్ వన్ సెవంటీ ఫైవ్ అంటూ దాదాపు మళ్లీ అధికారంలోకి వచ్చేసినంతగా ప్రచారం చేసుకున్న వైసీపీ నేత జగన్ కనీసం ప్రతిపక్ష హోదాకి తగినంత బలం లేనంతగా ఓటమి పాలయ్యారు. అధికారం కోల్పోయాక గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా జగన్ ఒంటరి పోరాటమే చేస్తున్నారు. జగన్ కు అప్పట్లో అండగా నిలిచిన మంత్రులు గానీ, పార్టీలో జగన్ కు సన్నిహితంగా ఉన్న నేతలెవరూ జగన్ దరిదాపుల్లో కనిపించడం లేదుజగన్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు విడదల రజనీ. జగన్ మొదటి విడత, రెండో విడతలోనూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి పనిచేశారు. తనకు ఏ బాధ్యత అప్పగించిన అంకిత భావంతో పనిచేయడం ఆమె నైజం. రాజకీయ అరంగేట్రం చంద్రబాబే చేయించారు. తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు. అయితే వైఎస్ జగన్ పార్టీ స్థాపించిన కొత్తల్లో ఆ పార్టీ పట్ల ఆకర్షితురాలై వైఎస్ఆర్ సీపీలో చేరారు. సొంతూరు యాదాద్రి భువనగిరి. అయినా ఆంధ్రా రాజకీయాలలో కీలక పాత్ర పోషించారుప్రస్తుతం అధికారం కోల్పోయి నైరాశ్యంతో ఉన్న విడదల రజనీ తన అడుగులు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. జగన్ తన తీరు మార్చుకోవడం లేదు. ఇంకా నిరంకుశ ధోరణితోనే ఉన్నారు. మొన్నటిదాకా తన పార్టీలో రోజా, విడదల రజనీ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో వారిని జగన్ పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. కొత్గా బుల్లితెర నటి శ్యామలను పార్టీలో కీలక పదవి అప్పగించారు. ప్రస్తుతానికి రోజా బయటపడకపోయినా రజనీ మాత్రం లోలోపల రగిలిపోతున్నారని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారువిడదల రజనీ రాజకీయాలలో సరికొత్త స్కెచ్ వేయడానికి వడివడిగా ముందడుగు వేస్తున్నారు. త్వరలోనే వైఎస్ఆర్ సీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. చిలకలూరి పేట ఎమ్మెల్యేగా అక్కడ స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ తన సేవా కార్యక్రమాలను నిరంతరం చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశంలో హేమాహేమీల వంటి పత్తిపాటి పుల్లారావు వంటి నేతనే ఓడించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి విడతలోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పైగా కీలకమైన ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిపిన సర్వేలో విడదల రజనీ చిలకలూరిపేట నుంచి ఓడిపోతారని సర్వే రావడంతో చివరి మూమెంట్ లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీచేయించారు జగన్. అయితే 50 వేల ఓట్ల తేడాతో రజనీ ఓడిపోయారుఇటీవలే మాజీ మంత్రి వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం రజనీ బాలినేని తో పవన్ కళ్యాణ్ జనసేప పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఇదే టాపిక్ ఆంధ్రా పాలిటిక్స్ లో వైరల్ న్యూస్ గా మారింది. అయితే దీపిపై విడదల రజనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు..సరికదా పార్టీకి రాజీనామా చేస్తున్పట్లు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అవన్నీ ఊహాగానాలే అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అటు తెలుగుదేశం నుంచి ఇటు బీజేపీ నుంచి కూడా విడదల రజనీకి ఆఫర్లు వస్తునే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ కాదని రజనీ జనసేనలోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో విడుదల రజనీ నిర్ణయం తీసుకోబోతోందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *