సిరా న్యూస్,ఖానాపూర్
విధులను సక్రమంగా నిర్వహించాలి
* ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* పారిశుద్ధ్య కార్మికుల హాజరు పట్టికను పరిశీలిన
విధులను సక్రమంగా నిర్వహించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల హాజరు పట్టికను ఆయన మంగళవారం ఉదయం పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీ సిబ్బంది విధులకు హాజరై విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయని, తడి చెత్త పొడి చెత్త ఆటోలను నడిపే డ్రైవర్లు, సిబ్బంది 12 వార్డులలో ప్రతి ఒక్క ఇంటి ముందు బండిలను ఆపి చెత్తను సేకరించాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు షబ్బీర్ పాషా , మున్సిపాలిటీ అధికారులు మానాల శంకర్ , మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.