సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ఎమ్మెల్యే విజయరమణ రావును కలిసిన రాంపూర్ మార్కెట్ పాలకవర్గం
ఇటీవల నూతనంగా నియమితులైన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి , వైస్ చైర్మన్ సబ్బానీ రాజమల్లు, నూతన డైరెక్టర్లు ఎమ్మెల్యే విజయరమణ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. తమ పై నమ్మకంతో కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గంలోకి నియమించిన సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు నూతన చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి కి, వైస్ చైర్మన్ సబ్బానీ రాజమల్లు కి. పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రైతు సంక్షేమానికి కృషి చేయాలని కాల్వశ్రీరాంపూర్ మండల వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.