సిరాన్యూస్,బేల
తక్కువ కాలంలో అధిక దిగుబడులు: రాశి సీడ్స్ టీఎస్ఎం ప్రమోద్‌కుమార్
* పెండల్ వాడలో రాశి సీడ్స్ షిఫ్ట్ బీజీ-2 పై వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన
రాశి సీడ్స్ షిఫ్ట్ బీజీ-2 విత్తనాలతో తక్కువ కాలంలో అధిక దిగుబడులు సాధించవచ్చని రాశి సీడ్స్ టీఎస్ఎం ప్రమోద్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్ వాడ గ్రామంలో బోర్ కార్ అనిల్ అనే రైతు చేనులో రాశి సీడ్స్ నూతన పత్తి రకము రాశి షిఫ్ట్ బిజీ టు క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాశి సీడ్స్ టీఎస్ఎం ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రాశి సీడ్స్ షిఫ్ట్ అనే పత్తి రకము తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి నిచ్చేరకము కాకుండా రసం పీల్చు, పురుగులు, తెల్ల దోమ, తామర పురుగులను సమర్థవంతంగా తట్టుకునే శక్తి ఉందని పత్తి తీత సులభంగా ఉంటుందని తెలిపారు. రెండవ పంటకు వెళ్ళవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, పీఓఎస్ కన్నాల రాకేష్, పవన్ పాల్గొన్నారు.